ఆరోగ్యమే మహా భాగ్యం



సర్వేంద్రియానాం నయనం ప్రధానం 
రచన - రామకృష్ణ 

సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. మరి అటువంటి కంటిని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని తెలుసుకుందాం. 

ఆహారం ద్వారా 

కంటి చూపు పరిరక్షణ మనం తీసుకునే ఆహార పదార్ధాల నుండే మొదలవుతుంది. అధ్యయనాల ప్రకారం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, లుటీన్, జింక్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ లు వయసుమళ్లడం వల్ల వచ్చే శుక్లాలు వంటి దృష్టి దోషాలను అరికడతాయి. వీటిని ఆహారం లో భాగం చేసుకోవడం ద్వారా దృష్టి దోషాలను తగ్గించుకోవచ్చు. 

ఆకుకూరలు, కేరట్స్ , గుడ్లు, బీన్స్, కమలా పళ్ళు వంటి సిట్రస్ జాతికి చెందిన ఫలాలు కంటి చూపుకి మంచివి. 

విశ్రాంతి కలిగించండి 

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు గడిపితే కన్నులకు అలసట, చూపు మసకబారటం, దూరంకి దృష్టి ఆనించడం కష్టం గా ఉండటం, పొడి బారిన కళ్ళు, తలనొప్పి, మెడ, నడుము అలాగే భుజం నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. 

అందుచేత, కంపూటర్ నుండి కొద్ది సేపు విరామం పొందండి. ఒక వేళ కంప్యూటర్ వద్ద ఎక్కువసమయం గడపవలసి వస్తే, కనీసం అరగంటకి ఒకసారి అయిదు నిమిషాల సేపు విరామం తీసుకోవాలి. ఆ సమయం లో బాల్కనీలోకి లేదా కిటీకీ వద్దకు వచ్చి దూరం గా ఉన్న ప్రదేశాలను చూడాలి. వీలయితే పచ్చని చెట్లను చూస్తే కంటికి అలసట తగ్గుతుంది. 

కళ్ళజోడు 

మీరు వాడుతున్న కళ్ళజోడు ప్రిస్క్రిప్షన్ కి తగినట్టుగా ఉందో లేదో అలాగే కంప్యూటర్ వాడకానికి సరైనదేనా అని గమనించాలి. కంటివైద్యుని సలహాని పాటించాలి.   

ఇటువంటి కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కంటి చూపుని సంరక్షించుకోవచ్చు. 

*****
ఈ సంచికలోని ఇతర రచనలు 

No comments:

Post a Comment