నవ్వుతూ బతకాలిరా! తమ్ముడూ ...
రచన - రామకృష్ణ
రచన - రామకృష్ణ
నవ్వడం ఒక భోగం
నవ్వకపోడం ఒక రోగం
హాస్యబ్రహ్మ జంధ్యాల గారు నవ్వు గురించి చెప్పిన విషయం అక్షరాలా నిజం. .
హాయిగా మనసారా నవ్వుకోవడం కూడా ఒక వరం. కొంత మందికి అన్నీ ఉన్నా హాయిగా నవ్వుకోగల అదృష్టం ఉండదు. కొంత మంది ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది హాయిగా నవ్వుతూ ఉంటారు.
అలాగే నవ్వు మన ఆరోగ్యం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందామా
నవ్వు మన ఆరోగ్యం పైన చూపే ప్రభావం పై అనేక ప్రయోగాలు జరిగాయి. వాటి సారం ఏంటంటే నవ్వు ప్రకృతి సిద్ధమైన సహజ బాధా నివారిణి. అంతే కాక గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని ఎంతగానో తగ్గించగలదు .
ఒత్తిడి తగ్గించగలిగే శక్తి నవ్వుకు ఉండటంవల్ల రక్త పోటును కూడా తగ్గించగలదు.
శరీరం లో సంతోష కారక రసాయనాలను ఉత్పత్తి చేయటం వల్ల ఇటువంటి అనేక ఆరోగ్యాలను మనం నవ్వు తో సొంతం చేసుకోవచ్చు! చూసారా మరి నవ్వు ఒక భోగమే.
నవ్వు మన మనస్సుకు కుడా ప్రశాంతత కలిగించి , జీవితం హాయిగా ఉంది అనే ఆశావహ భావనలు కలగచేస్తుంది.
కొసమెరుపేంటంటే నిజమైన , సహజ నవ్వు కు మాత్రమే కాక కృత్రిమంగా నవ్వినా పైన ప్రస్తావించిన లాభాలు పొందే అవకాసం ఉందట!!
అందుకే పార్కులలో చేరి కొంతమంది 'లాఫింగ్ క్లబ్' లు ఏర్పాటు చేసి మరీ నవ్వుతున్నారు. వారిని చూసి మనం నవ్వుకోకుండా ఈ వివరాలను గమనించి వారి లాగా , వారితో కలిసి ఈ నవ్వు లోని లాభాలను అనుభవిద్దాం.
--------------
ఈ సంచికలోని ఇతర రచనలు


No comments:
Post a Comment